తెలంగాణ రాష్ట్రంలో బుధవారం స్కూళ్లు, కాలేజీల బంద్ నిర్వహించనున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యాసంస్థల బంద్ కి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ లో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, ఏఐపీఎస్యూ, ఏఐఎఫ్డీఎస్, ఏఐడీఎస్వో, ఏఐఎస్బీ సంఘాలు పాల్గొంటున్నాయి.