దేశంలో 5జీ సేవలను అందించేందుకు సంబంధించిన 5జీ నెట్వర్క్ స్పెక్ట్రమ్ వేలం మూడో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. మరోవైపు ఎయిర్టెల్, జియో చైనా కంపెనీలతో 5జీ సేవల విషయంలో భాగస్వామ్యాన్ని క్యాన్సిల్ చేసుకోవడంతో చైనాకు తలుపులు మూతపడ్డాయని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. జియో,ఎయిర్టెల్ ఫిన్లాండ్కు చెందిన నోకియా, స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్, కొరియాకు చెందిన శాంసంగ్‌లతో భాగస్వామ్యాల్ని కుదుర్చుకున్నాయి.