టీఎస్ ఎంసెట్‌కు సంబంధించిన ఇంజినీరింగ్ ప్రాథమిక కీ విడుదలైంది. www. eamcet. tsche. ac. in అనే వెబ్సైట్లో ‘కీ’తో పాటు రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. అభ్యంతరాలను ఆగస్టు 1 సాయంత్రం 5 లోపు సమర్పించొచ్చని పేర్కొన్నారు. జులై 18, 19, 20 తేదీల్లో రెండు విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.