టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. అభ్యంతరాలు ఉంటే 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. www. eamcet. tsche. ac. in అనే వెబ్‌సైట్ నుంచి విద్యార్థులు రెస్పాన్స్ సీట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు జులై 30, 31 తేదీల్లో నిర్వహించిన పరీక్షలు సాఫీగా ముగిశాయి. రెండురోజుల్లో పరీక్షలకు మొత్తంగా 94, 476 మంది విద్యార్థులకు 80, 575 మంది (86. 3 శాతం) హాజరైనట్టు కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. జూలై 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు ముగిశాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాల ఫలితాలను ఒకేసారి విడుదలచేస్తామని గోవర్ధన్ వెల్లడించారు.