వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు కడప పరిధిలోని నెట్ వర్కు ఆసుపత్రుల్లో పనిచేసేందుకు ఆరోగ్యమిత్ర, టీం లీడరు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సంబంధించిన అర్హులకు శుక్రవారం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అర్హుల జాబితా జిల్లా వెబ్ సైట్ లో ఉంచామని, అర్హత కల్గిన వారు కడప ఉక్కాయపల్లెలో ఉన్న శ్రీనివాస్ ఇంజినీరింగ్ కళాశాల్లో ముఖాముఖి కి హాజరుకావాలని సూచించారు.