ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం సేవలకు శుక్రవారం ఉదయం అంతరాయం ఏర్పడింది. పేమెంట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అకౌంట్ లాగౌట్ అవ్వడంతో పాటు తిరిగి లాగిన్ చేయడంలో కూడా యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఫిర్యాదు చేయగా, పేటీఎం స్పందించి సమస్యను పరిష్కరించింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పేటీఎం సేవలు నిలిచినట్లు పేటీఎం తెలిపింది.