సెప్టెంబర్ 29న జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశంలో 5జీ నెట్వర్క్ను అధికారికంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక తొలి దశలో భాగంగా హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూర్, చండీఘఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రాం, జామ్నగర్, కోల్కతా, లక్నో, ముంబై, పుణే నగరాల్లో 5జీ సేవలు ప్రారంభం కానుండగా దశలవారీగా దేశమంతటా విస్తరించనున్నాయి.