తమిళనాడులోని ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించిన కౌన్సెలింగ్ ఈ నెల 25న ప్రారంభమై సెప్టెంబరు 21 వరకు జరుగనుంది. సీబీఎస్ఈ ఫలితాలు విడుదల జాప్యం కావటంతో ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లకు దరఖాస్తు స్వీకరణ గడువు జూలై 19 నుంచి జూలై 27 వరకు పొడిగించారు. ప్రస్తుతం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తికాగా, నీట్ ఫలితాలు వెలువడిన తర్వాత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.