వాట్సాప్లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. సాధారణంగా వాట్సాప్లో ఒకరికి పంపిన మేసేజ్ గంట వరకు అవతలి వ్యక్తి చూడకుండా డిలీట్ చేయొచ్చు. అయితే, ఇకపై ఆ అవకాశాన్ని 2 రోజుల వరకు కల్పిస్తోంది వాట్సాప్. అలాగే, వాట్సాప్లో గ్రూపులో ప్రతి ఒక్కరి మెసేజ్లను డిలీట్ చేసే ఆప్షన్ అడ్మిన్లకు ఉండనుంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఇది ఉపయోగపడుతుందని వాట్సాప్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్లు పరీక్షల దశలో ఉన్నాయి.