స్ట్రీమింగ్ వీడియో సేవల కోసం యూట్యూబ్ ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక శుక్రవారం వెల్లడించింది. కంపెనీ దాదాపు 18 నెలలుగా ఇదే పనిలో ఉందని ఆ కథనంలో పేర్కొంది. దీని కోసం వివిధ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలతో చర్చలను పునరుద్ధరించిందని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ నిర్ణయం అమలుకావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.