చాలా మంది పడుకున్న కాసేపటికే గురక పెడుతుంటారు. ఇది ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ సమస్యను పోగొట్టుకునేందుకు ఫిన్లాండ్లోని టుర్కు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 'వెల్ ఓ2' అనే మెషీన్ తయారు చేశారు. దీనికి ఉండే గొట్టం ద్వారా ఊదితే మెడ, ఛాతీ కండరాలు బలపడతాయి. తద్వారా గురక పోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ధర భారత కరెన్సీలో రూ.19,240గా నిర్ణయించారు.