కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖలో దేశవ్యాప్తంగా 23 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను మంజూరు చేసింది. ఇందులో 59,099 పోస్ట్‌మ్యాన్, 1445 మెయిల్ గార్డ్‌లు, 37,539 మల్టీ టాస్కింగ్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు సర్కిళ్ల వారీగా స్టెనోగ్రాఫర్ కు సంబంధించిన పోస్టులు కూడా మంజూరయ్యాయి. ఏపీలో 2289 పోస్ట్‌మెన్ పోస్టులు, 108 మెయిల్ గార్డ్ పోస్టులు, 1166 ఎంటీఎస్ పోస్టులు మంజూరయ్యాయి. తెలంగాణ సర్కిల్ పరిధిలో 1553 మంది పోస్ట్‌మెన్‌లు, 82 మంది మెయిల్ గార్డులు, 878 మంది ఎంటీఎస్ పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పాసై ఉండాలి. అలాగే కంప్యూటర్‌పై అవగాహన కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ లేదా 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 18-32 ఏళ్లు ఉండాలి. మరిన్ని వివరాలు https://www.indiapost.gov.in/ వెబ్ సైట్ లో చూడండి.