ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత జిల్లాకు 5 స్కూళ్లను గుర్తించి పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనుంది. దీని కోసం ఎస్‌సీఈఆర్‌టీ కసరత్తు ప్రారంభించింది. నిడమానూరులో చేపట్టిన ఈ తరహా కార్యక్రమాన్ని నమూనాగా తీసుకుని పైలెట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ముందుగా టీచర్లకు శిక్షణనిస్తారు. వచ్చే నెలలో తరగతులు ప్రారంభిస్తారు.