చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి ఓ రోబోను తయారు చేసింది. దానికి 'సైబర్ వన్' అనే పేరు పెట్టింది. ఈ సైబర్ వన్ అనే రోబో 177 సెంటీ మీటర్ల ఎత్తు ఉంటుంది. మనుషులకు సంబంధించిన సంతోషం, విషాదం వంటి 45 రకాల భావోద్వేగాలను, వాతావరణానికి సంబంధించి 85 రకాల ధ్వనులను గుర్తించగలదు. తన చుట్టూ ఉండే పరిసరాలను వర్చువల్ దృశ్యాలగా మార్చుకుని ఈ రోబో చూడగలదు. దీని ధర రూ.82.7 లక్షలు.