national
రాంబన్ జిల్లాలో భారీ వర్షాలు
ప్రజలకు యంత్రాంగం అప్రమత్తత హెచ్చరిక
జమ్మూ కాశ్మీర్:జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. హఠాత్తుగా వాతావరణం మారి వర్షం విరుచుకుపడటంతో జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి ముందస్తు అప్రమత్తత హెచ్చరికలు (Alert) జారీ చేసింది.
ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల్లో నివసిస్తున్న వారు, నదులు, వాగులు మరియు ఇతర జలవనరుల సమీపంలోని ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించారు. అత్యవసర సహాయం కోసం స్థానిక యంత్రాంగాన్ని సంప్రదించాలని తెలిపారు.
