telanagana
కొండా మురళీకి అపాయింట్‌మెంట్ నిరాకరించిన భట్టి విక్రమార్క
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు కొండా మురళీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నుంచి చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ, ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలిపై జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవాలని కొండా మురళీ ప్రయత్నించారు.
ప్రస్తుత పరిస్థితిపై భట్టి విక్రమార్కకు వివరణ ఇచ్చేందుకు కొండా మురళీ ఆయన అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ, భట్టి విక్రమార్క అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగడం, పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతున్న తరుణంలో డిప్యూటీ సీఎం కొండా మురళీకి అపాయింట్‌మెంట్ నిరాకరించడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.