ఆర్టీసీ బస్సులో మహిళపై కండక్టర్ దాడి

Select Suryaa Now

శంషాబాద్: దిగాల్సిన బస్ స్టాప్‌లో ఆపమని అడిగినందుకు ఆర్టీసీ బస్సు కండక్టర్ తనపై దాడి చేసి, దుర్భాషలాడాడని ఒక మహిళ కన్నీరు మున్నీరుగా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

బాధితురాలి కథనం ప్రకారం... ఆమె శంషాబాద్ వద్ద బస్సు ఎక్కి మదన్ పల్లి తండా వద్ద దిగేందుకు టికెట్ తీసుకుంది. అయితే, డ్రైవర్ బస్సును మదన్ పల్లి తండా వద్ద ఆపకుండా ముందుకు తీసుకెళ్లి కొత్తూరు వద్ద నిలిపాడు.

తనను దిగాల్సిన చోట ఎందుకు ఆపలేదని ప్రశిన్చగా, కండక్టర్ ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడని పేర్కొంది. బూతులు తిడుతూ, విచక్షణారహితంగా తనపై చేయి చేసుకున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తోటి ప్రయాణికులు చూస్తుండగానే కండక్టర్ దౌర్జన్యానికి దిగాడని, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది.