ఏపీ ప్రభుత్వం మున్నూరు కాపులను బీసీగా గుర్తించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్నూరు కాపులను బీసీ-డీ జాబితాలో చేర్చిన ఏపీ ప్రభుత్వం... ఆ మేరకు ఇక నుంచి మున్నూరు కాపులకు బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వనుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలుగా గుర్తించిన రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనమైన 7 మండలాల్లో మున్నూరు కాపుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇటీవల సీఎం జగన్‌ను కలిసిన మున్నూరు కాపు సామాజికవర్గం తమను బీసీలుగా గుర్తించాలని కోరారు.దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa