మద్యం మత్తులో ఓ వ్యక్తి పట్ల స్నేహితులు దారుణంగా ప్రవర్తించారు. ఒడిశాలోని బలిపాదర్కు చెందిన కృష్ణ చంద్ర రౌత్ గుజరాత్లోని బూజ్లో టెక్స్టైల్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఇటీవల అతడి ఫ్రెండ్స్ మందు పార్టీ చేసుకున్నారు. మత్తు ఎక్కువై ఓ స్టీల్ గ్లాసును రౌత్ మలద్వారం నుంచి లోపలికి నెట్టేశారు. స్వస్థలానికి వచ్చిన అతడు ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. వైద్యులు తాజాగా శస్త్రచికిత్స చేసి గ్లాసును తీసేశారు.