విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆగస్టు 22న Mrs. M. దీపికా , IPS, సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకొని, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యలతో పోలీస్ వారిని సంప్రదించిన ప్రజలకి త్వరగతిన తగిన న్యాయం చేసే విధంగా పోలీస్ వారు నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేసారు.