కడప నగరంలోని పలు హోటళ్లలో నగరపాలక కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ గురువారం రాత్రి తనిఖీ చేశారు. కృష్ణా సర్కిల్ లోని ఓ హోటల్ ను పరిశీలించి అక్కడ నాసిరకం కోడిగుడ్లు ఉపయోగిస్తున్నారని గమనించి జరిమానా విధించారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని మరో హోటల్ లో నాలుగురోజుల కిందటి చికెన్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. మరో హోటల్లో పరిశుభ్రత, సర్వీసు సక్రమంగా లేదని గుర్తించి జరిమానా విధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa