రోడ్డు విస్తరణలో కొన్నేళ్లుగా పారిశుద్ధ పనులు చేస్తూ జీవిస్తున్న కార్మికుల ఇళ్ళను కూల్చవద్దని కోరుతూ దళిత సంఘాల నాయకులు కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులు చేస్తేనే కుటుంబాలు గడిచే వీరి ఇళ్లను కూల్చితే మళ్ళీ కట్టుకునే అవకాశం ఉండదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేవలం 70 అడుగులకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు.