చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. కలెక్టరేట్లో గురువారం ఆయన జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, అధికారులతో కలిసి జిల్లాలోని 7, 202 మంది చేనేత కార్మికులకు రూ. 17, 28, 48, 000 విలువ చేసే చెక్కును అందజేశారు. అర్హతలుండి సాయం అంద కుంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో జేసీ తమీమ్ అన్సా రియా, రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ డైరెక్టరు సురేంద్ర నాథ్, తొగటవీర క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయప్రసాద్, డైరెక్టరు నీలం రమణమ్మ, జిల్లా చేనేత, జౌళిశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.