ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ సిగ్గుతో తలదించుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 27, 2022, 01:04 PM

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  కి మావోయిస్టుల నుంచి రక్షణకు 6+6 కమాండోలు అయితే..వైసీపీ పార్టీ  గూండాల నుంచి రక్షణకు 12+12 కమాండోలు అవసరమయ్యారు అని టీడీపీ నాయకులూ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలియజేసారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుప్పంలో గత రెండు రోజులుగా నెలకొన్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి ఎన్.ఎస్.జీ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశం మొత్తంలో శాంతి భద్రతలు లోపించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవ్వడం దురదృష్టకరం. దేశంలోనే ప్రతిష్టాత్మక భద్రతా సంస్థ ఎన్.ఎస్.జీ నిర్ణయం ఏపీలోని పరిస్థితులకు అద్దం పడుతోంది...సీఎం జగన్  సిగ్గుతో తలదించుకోవాలి అని వాపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com