రామకుప్పం మండల సరిహద్దుల్లోని తమిళనాడు రాష్ట్రంలోని సారేకల్ వద్ద శుక్రవారం రాత్రి ఒక నిమ్మతోటలో చిరుతపులి చనిపోయింది. చిరుత మృతిపై స్థానికులు శనివారం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత వయసు 4 సంవత్సరాలు ఉంటుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. అనుమానాస్పదంగా చిరుత చనిపోవడంతో ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది.