భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో భాద్రపద మాసోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శివాజీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 31న వినాయక చవితి సందర్భంగా శివాలయంలో ఏర్పాట్లు చేయనున్నారు. అదే రోజు చిత్తా నక్షత్రం ఉండటంతో యాగశాలలో సుదర్శన హోమం చేస్తారు. సెప్టెంబరు 6న సర్వ ఏకాదశిని పురస్కరించుకుని స్వామికి పవళింపు సేవ ఉండదన్నారు.
7న శ్రీవామన జయంతికి చుట్టు సేవ ఉంటుందని, 20న పునర్వసు ఉత్సవం, 21న పుష్యమికి సీతారామ పట్టాభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 25న మహాలయ అమావాస్యను పురస్కరించుకుని పవళింపు సేవ చేయరని, వచ్చే నెల 10, 11 తేదీల్లో గోదావరిలో గణేశ్ నిమజ్జనోత్సవం చేయనున్నందున ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.