ఏపీలో భారీగా పెరిగిన వినాయక విగ్రహాల ధరలు పెరిగాయి.. రెండేళ్లుగా కొవిడ్ కారణంగా వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు లేవు. దీంతో ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని ఏపీ జిల్లా వ్యాప్తంగా అందరూ ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో విగ్రహాల ధరలు భారీగా పెరగడం, మండపాల ఏర్పాటుకు అధికారులు నిబంధనలు కఠినతరం చేయడంతో నిర్వహకులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు విద్యుత్తు శాఖకు వెయ్యి వోల్టులకు రూ.2395లు, 1500 వోల్టులకు రూ.3145లు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు.