రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని పెండ్లిమర్రి మండల టీడీపీ అధ్యక్షుడు గంగి రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి కిషోర్ రెడ్డి లు పేర్కొన్నారు. పెండ్లిమర్రి మండల పరిధిలోని నాగాయపల్లె, కారపురెడ్డి పల్లె, ఎరుసుపల్లె గ్రామాలలో సోమవారం ప్రజలతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటటికి తిరుగుతూ గత తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వానికి ఉన్న తేడాలను ప్రజలకు వివరించారు. చెత్త మీద కూడా పన్ను వేసే చెత్త ప్రభుత్వం ఇదే అని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.