ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి చేనేత కార్మికుల కష్టసుఖాలు తెలుసుకొని ఆయన పాదయాత్రలో చేనేత కార్మికులకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చి చేనేత కార్మికుల కుటుంబాలలో ఆనందాలు నింపారని వైయస్సార్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసిమ బాబు తెలిపారు.
చెన్నూరు మండలంలోని రామన పల్లె గ్రామంలో 48 మంది చేనేత కార్మికులకు నేతన్న హస్తం మంజూరు కాబడిందని ఇదంతా కూడా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కృషి వల్లనే సాధ్యమైంది అని ఆయన అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.