మైనర్ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఢిల్లీ హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. శారీరక సంబంధం పెట్టుకునే ముందు ఏ వ్యక్తీ ఆధార్ కార్డు, పాన్ కార్డు చెక్ చేయలేరని వ్యాఖ్యానించింది. ఇక బాధిత బాలిక ఆధార్ కార్డులో ఆమె 1998లో జన్మించిందని, పాన్ కార్డ్ 2004 అని వివరాలు ఉన్నాయి.