ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు కేరళలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అవినీతిపరులను కాపాడేందుకు కొన్ని రాజకీయ పక్షాలు ఏకమవుతున్నాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై బిహార్ సీఎం నీతీశ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఎవరైనా అవినీతిపరులను ఎందుకు కాపాడుతారని ఆయన ప్రశ్నించారు. బిజేపి వారు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే వైఖరి గురించి మోడీ ఏం చెబుతారని నీతీశ్ నిలదీశారు.