టోక్యో ఒలింపిక్స్ లో భారత జావెలిన్ క్రీడాకారుడు నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన తెలిసిందే. కాగా అతడు ఉపయోగించిన జావెలిన్ ను ఆన్ లైన్ లో వేలం వేయగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రూ.1.5 కోట్లకు ఈ జావెలిన్ ను సొంతం చేసుకుంది. నీరజ్ చోప్రా జావెలిన్లలో ఒకదాన్ని ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇచ్చారు. మరోవైపు ఫెన్సింగ్ క్రీడాకారిణి భవానీ దేవి ఖడ్గం వేలంలో రూ.1.25 కోట్లు పలికింది.