నాసా ప్రయోగానికి కాలం కలసిరావడంలేదు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించతలపెట్టిన ఆర్టెమిస్-1 శనివారం మరోమారు వాయిదా పడింది. చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు ఉద్దేశించిన ఈ ప్రయోగం ఇప్పటికే గత నెల 29న వాయిదా పడిన సంగతి తెలిసిందే. రాకెట్ ఇంజిన్‌లో ఇంధన లీకేజీ కారణంగా గత నెల 29న ఆర్టెమిస్- 1 ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన నాసా... తిరిగి ఈ నెల 3న ప్రయోగించనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే.
తాజాగా శనివారం కూడా గతంలో తలెత్తిన సమస్యే తలెత్తింది. రాకెట్‌లోని ఇంజిన్ నెంబర్ 3లో ఇంధన లీకేజీ కనిపించగా... దానిని సరిదిద్దే యత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో వరుసగా రెండో పర్యాయం ఆర్టెమిస్- 1ను వాయిదా వేస్తున్నట్లు నాసా శనివారం ప్రకటించింది. అయితే తిరిగి ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టనున్నదీ మాత్రం నాసా వెల్లడించలేదు.