క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టిలు డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరపాలని అనుకున్నప్పటికీ.. మహారాష్ట్ర ఖండాలలో అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి ఇంట్లో పెళ్లి జరిపేందుకు నిర్ణయించినట్లు సమాచారం. దీనికోసం ఫేమస్ ఈవెంట్ మేనేజర్ కు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియా & ఎంటర్టైనర్స్ పింక్ విల్లా తెలిపింది.