మిస్టర్ ఐపీఎల్‌గా గుర్తింపు పొందిన భారత క్రికెట్ జట్టు సీనియర్ ఆటగాడు సురేశ్ రైనా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమాచారాన్ని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఐపీఎల్‌తో సహా అన్ని ఫార్మాట్లలో ఆడనని చెప్పాడు. ఈ సందర్భంగా తనకు ఐపీఎల్‌లో అవకాశం కల్పించిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌కు సురేష్ రైనా అందుబాటులో ఉంటాడు. దక్షిణాఫ్రికా టీ20, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టీ20 లీగ్ ఫ్రాంచైజీలు ఆడేందుకు సంప్రదింపులు జరుపుతున్నాయని, అయితే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు.
చెప్పుకోదగ్గ సురేష్ రైనా రికార్డులు, ఆసక్తికర విషయాలు
1. వన్డే అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్, టెస్ట్ అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ
2. టీ20ల్లో సెంచరీ సాధించిన తొలి భారత ప్లేయర్, 2010లో వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై రైనా 101పరుగులు చేసి ఈ రికార్డ్ తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో సెంచరీ చేసిన ఏకైన భారత లెఫ్టాండర్.
3. మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించిన తొలి భారత ప్లేయర్ : హాంకాంగ్‌పై తన తొలి వన్డే సెంచరీని సాధించగా, శ్రీలంకపై తొలి టెస్టు శతకం,దక్షిణాఫ్రికాపై తన తొలి టీ20 సెంచరీ సాధించాడు.
4. ధోనీ (228) తర్వాత అత్యధిక మ్యాచ్‌లు (200) సీఎస్కే తరఫున ఆడిన ప్లేయర్
5. ఐపీఎల్‌లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ : ఈ రికార్డు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 2008 నుంచి 2016 ఐపీఎల్లో సగం టోర్నీ పూర్తయ్యేవరకు ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌ని రైనా మిస్ చేయలేదు. 9వ ఎడిషన్‌లో.. గుజరాత్ లయన్స్ తరఫున ఆడుతుండగా.. తన భార్య డెలివరీ ఉండడంతో మిస్సయ్యాడు. అతను వరుసగా 158 మ్యాచ్‌లు ఆడాడు.
6. ఐపీఎల్లో రైనా 5000పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
7. ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు (714)పరుగుల రికార్డు రైనాదే. అతని తర్వాత ధోనీ (522పరుగులు) ఉన్నాడు.
8. ట్వంటీ20 కెరీర్‌లో 6000పరుగుల మైలురాయి, అలాగే 8000పరుగులు మైలురాయి చేసిన తొలి భారతీయ ప్లేయర్
9. ఐపీఎల్లో 100సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడు. క్రిస్ గేల్ తర్వాత ఆ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్
10. ఐపీఎల్లో 200 సిక్సర్లు బాదిన 7వ బ్యాటర్, అతని సిక్సుల సంఖ్య 203, ఫోర్లు 506.