డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఇటీవల ఆసక్తికర ఘటన జరిగింది. వర్షాకాలంలో స్థానికులు నదిని దాటేందుకు ఈ చిన్న వంతెనను నిర్మించారు. అధికారులు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కాసేపటికే క్షణాల్లో ఆ వంతెన కుప్పకూలింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.