కేరళలోని తిరువనంతపురంలోని వర్కాలా గ్రామంలో మంగళవారం దారుణం జరిగింది. అనీశ్ (35) అనే వ్యక్తి తన భార్యను హెవీ మెటల్ ల్యాంప్ తో కొట్టి చంపాడు. వారికి 2 నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి పాల్పడ్డాడు. మెటల్ ల్యాంప్‌తో భార్య తలను పగులగొట్టాడు. పొరుగింటి వారు ఆస్ప్రతికి తరలించినా అప్పటికే ఆమె మరణించింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.