ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించబోతున్నాం: బీజేపీ ఎంపీ జీవీఎల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 10:10 PM

కేంద్రంలో మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించబోతున్నామని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింగహారావు వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2024లో అద్భుతమైన విజయం సాధించేలా కార్యాచరణ ప్రారంభించిందని ఆయన ప్రకటించారు. రాబోయే ఎన్నికల నాటికి 400 సీట్లు గెలిచి కేంద్ర ప్రభుత్వంలో మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం లేని కారణంగా రాష్ట్రం వెనుకబడిందని.. అభివృద్ధి కోసం ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం చాలా ఉందని పేర్కొన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 5,000కు పైగా సమావేశాలు నిర్వహిస్తామని జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. బీజేపీని విస్తరించే కార్యాచరణలో భాగంగా గతంలో గెలవని 144 స్థానాల్లో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిటనట్లు వివరించారు. ఆ జాబితాలో విశాఖపట్నం కూడా ఉందని.. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని తెలిపారు.


ఏపీలో భవిష్యత్ బీజేపీదే అని.. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉందని జీవీఎల్ అన్నారు. తెలుగు దేశం పార్టీపై కూడా జనంలో ఏమంత సానుకూలత లేదని అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడే ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేన కూటమిది మాత్రమే అన్నారు. జనసేనతో తాము కొత్తగా పొత్తు పెట్టుకునేది కాదని.. ఎప్పటి నుంచో భాగస్వామ్యులుగా ఉన్నామని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com