వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాకే సంగం బ్యారేజీ పనులను పూర్తి చేశామని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. రాష్ట్రంలో బ్యారేజీలను చంద్రబాబే పూర్తి చేశారని చెప్పడానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలన్నారు ఆయన మండిపడ్డారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్‌నూ చేపట్టలేదని.. ఇప్పుడు ప్రాజెక్టులపై టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది అన్నారు. తాము చేయని పనులను చేసినట్టు చెప్పుకుంటున్నారని.. కనీసం రైతులకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాకే సంగం బ్యారేజీ పనులను పూర్తి చేశామన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ ఎంత మేరకు దెబ్బ తిందో ఇంకా నిర్ధారించలేదని.. ఇంకా సమయం పడుతుందన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బతిందని.. దీన్ని ఏ సంస్థా ధ్రువీకరించలేదని.. ఈ విషయాన్ని చెప్పే సంస్థలు ప్రపంచంలో ఎక్కడా లేవు అన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడంపై నిర్ధారణ వచ్చేంత వరకు పోలవరం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం జరగదని.. నేషనల్ హైడ్రో పవర్ కార్పోరేషన్ సంస్థ అధ్యయనం చేసి నిర్ధారణ చేస్తుందన్నారు.. అధ్యయనం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదన్నారు. పోలవరం సహా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాకూడదని టీడీపీ కోరుకుంటోందని.. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయితే తామే నిర్మిస్తామని చంద్రబాబు ప్రగల్భాలు పలికి ఎందుకు టేకప్ చేసిందని ప్రశ్నించారు. కాపర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ ఎందుకు కట్టారో చెప్పాలన్నారు.
కాపర్ డ్యాం కంటే డయాఫ్రం వాల్ కట్టడం ముమ్మాటికీ తప్పే అన్నారు మంత్రి. పోలవరంపై ఇతర రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. ఏదో జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని మండిపడ్డారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి టీడీపీ కారణం కాదా అన్నారు రాంబాబు. కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడానికి ఎందుకు అనుమతించారని పీపీఏను, సీడబ్ల్యూసీని, కేంద్రాన్ని అడుగుతామన్నారు. సంగం బ్యారేజ్ చంద్రబాబు రెక్కల కష్టమని టీడీపీ సిగ్గు లేకుండా చెప్పుకుంటోందని.. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లూ ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేయాలని ఆలోచన చేశారా అంటూ ప్రశ్నించారు.