మీ ఎముకలు పెలుసుగా లేదా బలహీనంగా మారకుండా ఉండటానికి కాల్షియం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరం సరిగా పనిచేయడానికి కాల్షియం చాలా అవసరం. ఇది విటమిన్ డి ద్వారా లభిస్తుంది. ఎముకలలో కాల్షియం లేకపోవడం వల్ల ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారతాయి. అరటి పండులో బోలెడు ఖనిజాలు ఉంటాయి. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా క్రీడాకారులకు, వ్యాయామం చేసేవారికి అరటిపండు చక్కగా ఉపయోగపడుతుంది. అలా పైనాపిల్, దానిమ్మ పండ్లు తినడం ద్వారా కీళ్ల నొప్పులను అడ్డుకోవచ్చు. కివి పండ్లు ఎముక మజ్జను పెంచడంలో మేలు చేస్తుంది.