బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీన పడి, అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనానికి తోడు ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి కారణంగా మంగళ, బుధ వారాల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయని పేర్కొన్నారు. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని అంచనా వేశారు. ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.