ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న షుగర్ ఫ్రీ లడ్డూ ప్రసాదంపై టీటీడీ తాజాగా స్పష్టతనిచ్చింది. అటువంటి ఆలోచన లేదని, వదంతులు నమ్మొద్దని భక్తులకు సూచించింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పినట్లు పేర్కొంటూ కొన్ని నకిలీ వెబ్సైట్లలో వచ్చిన వార్తలను టీటీడీ ఖండించింది. శ్రీవారి లడ్డూకు పేటెంట్ ఉందని, మధుమేహ బాధితుల కోసం ప్రత్యేకంగా లడ్డూ చేయిస్తే మరికొన్ని కొత్త డిమాండ్లు వస్తాయని వివరించింది.