కెనడాలో జరగనున్న అంతర్జాతీయ గీతా మహోత్సవ్ సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. అంతర్జాతీయ గీతా జయంతి మహోత్సవాన్ని గత ఆరు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని, ఈ క్రమంలో ఈ ఏడాది గీతా మహోత్సవాన్ని కెనడాలోని లివింగ్ ఆర్ట్ సెంటర్ మిస్సిసాగాలో జరుపుకోనున్నట్లు హర్యానా ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. తొలిసారిగా విదేశీ గడ్డపై ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు హర్యానా ప్రభుత్వం తరపున పట్టణ స్థానిక సంస్థల మంత్రి కమల్ గుప్తా నేతృత్వంలోని ప్రతినిధి బృందం కెనడాకు వెళుతుందని ప్రతినిధి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa