భర్త వేధింపులు భరించలేక గృహిణి ఆత్మహ త్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు సీతానగరం మండలం పెదభోగిలి గ్రామానికి చెందిన పల్లి వాణిశ్రీకి పల్లి రామకృష్ణతో వివాహమై 10 సంవత్సరాలైంది. ముగ్గురు ఆడ పిల్లలు. భర్త ఆర్మీలో పనిచేస్తున్నాడు. వాణిశ్రీకి తల్లితండ్రులు లేరు. అమ్మమ్మ పెంచి పెద్ద చేసింది. గత మూడు సంవత్సరాలుగా భార్య పిల్లలను మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఆరు నెలలుగా విధులకు హాజరు కాకుండా తాగుతూ ఉన్నాడు.
దీంతో కొంతకాలంగా పిల్లల ను తీసుకొని భర్తతో దూరంగా ఉంటుంది అయినా ఎక్కడ ఉంటే అక్కడకు ఆమె వచ్చి చిత్రహింసలు చేస్తున్నాడు. అమ్మమ్మ చనిపో యిందని విషయం తెలుసుకున్న రామకృష్ణ అక్కడికి వచ్చాడు. అమ్మమ్మ వలన తనకు వారసత్వంగా వచ్చిన 26 సెంట్ల భూమిని అమ్మితే సుమారు కోటి రూపా యలు వస్తుందని విషయం తెలుసుకొని తండ్రితో లోపాయికారిగా ఒప్పందం చేసుకొని వచ్చి ఇవ్వకపోతే అందరినీ చంపుతానని బెదిరించడంతో అతని హింసలు భరించలేక మనస్తాపం చెంది వాణిశ్రీ ఇంట్లో ఉన్న చీమలమందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన ఆమె మేనత్త వెంటనే పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రికి 108 ద్వారా తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. ఔట్ పోస్టు పోలీసులు వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు.