గంగాధర నెల్లూరు మండలం, వేపం జేరిలో వెలసిన శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో స్వామి వారి ఉత్సవ మూర్తులకు బుధవారం వివిధ సుగంధ ద్రవ్యాలతో ఆలయ అర్చకులు సహస్రనామాల అర్చనాలతో అభిషేకించారు. అనంతరం వివిధ సుగంధ పరిమళభరిత పుష్పాలతో అలంకరించి , నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉభయ దారులుగా దేవస్థానం ట్రస్ట్ కే ఎస్ శ్రీధర్ దంపతులు వ్యవహరించారు.