ఉన్నాడో ఏది చేసినా అది ఘన కార్యమే. అలాంటి జాబితాలో ఎలాన్ మస్క్ చేరిపోయారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కాలేజీ రోజుల నాటి ఫోటోలను వేలం వేయగా.. భారీ స్పందన లభించింది. కాలేజీ రోజుల్లో ప్రేమాయణం సాగించిన యువతితో దిగిన ఫోటో భారీ ధరకు అమ్ముడుపోవడం విశేషం. మస్క్ తన మాజీ ప్రియురాలు జెన్నిఫర్ గ్వైన్‌తో దిగిన ఫోటో ఏకంగా 1,65,000 డాలర్లు (భారత కరెన్సీలో రూ.1.3 కోట్లకుపైగా) పలికినట్టు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. మస్క్‌కు చెందిన ఈ ఫోటోలను ఇది వరకూ ఎన్నడూ చూడనవని బోస్టన్‌కు చెందిన వేలం సంస్థ ఆర్ఆర్ ఆంక్షన్ పేర్కొంది. మస్క్ కాలేజీ స్నేహితురాలు జెనిఫర్ గ్వైన్ ఫోటోలు జ్ఞాపకాల సమాహారం అని వ్యాఖ్యానించింది.
వేలం వేసిన ఓ ఫోటోను మస్క్ బుధవారం తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు 94-95 మధ్య జెన్నిఫర్‌తో ఎలాన్ మస్క్ డేటింగ్‌లో ఉన్నారని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఆ సమయంలో జెన్నిఫర్ పుట్టిన రోజుకు మస్క్ ఎమరాల్డ్ గ్రీన్ రత్నాలు పొదిగిన బంగారు నెక్లెస్‌ను కానుకగా ఇచ్చారని తెలిపింది. ఇది 51,000 డాలర్లకు (అంటే రూ.41 లక్షలకు) అమ్ముడయ్యింది. అలాగే, ‘‘బూ-బూ’ అని రాసి ఉన్న బర్త్‌డే గ్రీటింగ్ కార్డు కూడా దాదాపు రూ.13 లక్షలకు అమ్ముడుపోవడం విశేషం.
వేలంలో మొత్తం 18 పాత ఫోటోలు ఒక్కొక్కటిగా అమ్ముడిపోయాయని చెప్పింది. అయితే, మస్క్, గ్వైన్ మధ్య ప్రస్తుతం ఎటువంటి సంబంధాలు లేవని పేర్కొంది. కాగా, ఎలాన్ మస్క్ ప్రస్తుతం సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి బయటపడేందుకు న్యాయపోరాటం చేస్తున్నారు. అక్టోబరులో వివాదంపై విచారణ కొసాగుతోంది.
మరోవైపు, 44 బిలియన్ డాలర్ల బిడ్‌ను ట్విట్టర్ వాటాదారులు మంగళవారం ఆమోదించారు. ప్రస్తుత ట్విట్టర్ ట్రేడింగ్ ధర కంటే షేరుకు మస్క్ చెల్లించే ప్రతిపాదిత ధర ఎక్కువగానే ఉంది. అయితే, ఒప్పంద సమయంలో కంపెనీ వాస్తవాలను దాచిపెట్టిందని ఆరోపిస్తూ మస్క్ వైదొలగడానికి ప్రయత్నించినప్పటికీ ట్విట్టర్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.