రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాగోలా డబ్బు రాకుండా ఆగిపోతే, లేదా ఆపేయగలిగితే... కేంద్రప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్‌కు, దేశంలోని ఆర్థిక సంస్థలకు, బ్యాంకులకు... ఇలా అన్నింటికీ తప్పుడు ఉత్తరాలు రాసి, కోర్టుల్లో సైతం తప్పుడు కేసులు వేసి మరీ ఆపేయగలిగితే... ఇక్కడ పేదలకు మనం అమలు చేస్తున్న మంచి స్కీములన్నీ ఆగిపోతాయన్న ఒకే ఒక్క స్కీమ్‌తో రాత్రనక, పగలనక కష్టపడుతున్న శక్తులను మనం చూస్తున్నాం అని సీఎం జగన్ తెలియజేసారు.
రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఎంత పెద్ద సవాలు అయినా, కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి, రకరకాల సవాళ్లు విసిరినా కూడా.. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా... దేశంలో అనేక రాష్ట్రాలకన్నా మెరుగ్గా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను నిర్వహిస్తున్నాం. మన 5.3 కోట్ల ప్రజల కోసం.. ఇంటింటికి సంక్షేమం, అభివృద్ధి చేస్తూ...మేనిఫెస్టోలో చెప్పిన 98.4 శాతం హామీలను అమలు చేసిన, చేస్తున్న ప్రభుత్వంగా... ఈ రాష్ట్ర శాసన సభ వేదికగా తెలియజేస్తున్న అని సీఎం జగన్ తెలిపారు.