అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం మాలేపాడు పంచాయతీ ఆవులపల్లె సమీపంలో కోడిపందెం ఆడుతున్న 18 మందిని శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ సత్య నారాయణ తెలిపారు. ఆవులపల్లె సమీపంలో పెద్దఎత్తున కోడిపందెం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో 18 మందితో పాటు 10 ద్విచక్ర వాహనాలు, రెండు పందెం కోళ్లు, రూ. 12, 120 స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa