వచ్చే రెండేళ్లలో ఆర్బీకే స్థాయిలో 2 వేల డ్రోన్స్ తీసుకొచ్చే ఆలోచనతో అడుగులు వేస్తున్నాం. వీటి కోసం గుర్తించిన రైతు కమిటీల్లో ఒకరికి డ్రోన్ పైలెట్‌గా శిక్షణ ఇచ్చి లైసెన్స్ ఇస్తాం. ఒక్కో డ్రోన్ కోసం రూ.10 లక్షలు ఖర్చు పెడుతున్నాం అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. అలానే, ప్రతి ఆర్బీకే పరిధిలో మార్చి–ఏప్రిల్ నాటికి భూసార పరీక్షలు చేసి, సాయిల్ హెల్త్ కార్డులు ఇస్తూ సాయిల్ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. తద్వారా ఏ పంటకు ఏ ఎరువు ఎంత వేయాలో ప్రతి రైతుకు అవగాహన వస్తుంది అన్నారు.
చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ కరువే.. 2014లో 238 మండలాలు, 2015లో 359, 2016లో 301, 2017లో 121, 2018 ఖరీఫ్‌లో 347, రబీలో 257 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం చూశాం. అందుకే చంద్రబాబు పాలన విషయంలో ఒక నానుడి ఉంది. కరువు–బాబు ఇద్దరూ కవల పిల్లలు అంటారు. మన ఈ 40 నెలల పాలనలో ఏ ఒక్క ఏడాది ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు అని అయన తెలిపారు.