చిరుధాన్యాల్లో శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, పీచు పదార్థం, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. బి12, బి6 విటమిన్లు కూడా ఉంటాయి. చిరుధాన్యాలు రక్తహీనత, మలబద్ధకం సమస్యను నివారించడంలో తోడ్పడతాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎముకలు బలంగా తయారయ్యేందుకు దోహదపడతాయి. శరీర బరువు అదుపులోకి తీసుకొస్తాయి.